సూర్యాపేట కల్నల్ సంతోష్‌బాబుకు మహావీరచక్ర.. ప్రకటించిన ప్రభుత్వం
- గతేడాది జూన్ 15న గల్వాన్ లోయలో దురాక్రమణకు చైనా యత్నం
- తీవ్రంగా ప్రతిఘటించిన భారత సైన్యం
- చైనా సైనికుల దాడిలో సంతోష్‌బాబు వీరమరణం
- మరణానంతరం ‘మహావీరచక్ర’ను ప్రకటించిన ప్రభుత్వం
సంతోష్‌బాబు బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా వ్యవహరించేవారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయ వద్ద చైనా దురాక్రమణకు ప్రయత్నించింది. భారత సేనలు దీనిని తీవ్రంగా ప్రతిఘటించాయి. వారిని దీటుగా ఎదుర్కొని తిప్పికొట్టాయి. ఈ దాడిలో భారత్‌కు చెందిన 21 మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో కల్నల్ సంతోష్‌బాబు ఒకరు. అలాగే, భారత సైనికుల దాడిలో చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగింది.