నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం!
- నేడు మకర సంక్రాంతి
- మధ్యాహ్నం తరువాత సన్నిధానానికి అయ్యప్ప ఆభరణాలు
- తక్కువగా కనిపిస్తున్న రద్దీ
మామూలుగా అయితే, సంక్రాంతి రోజున శబరిమలకు సుమారు 10 లక్షల మందికి పైగానే అయ్యప్ప భక్తులు చేరుకుని మకర జ్యోతిని దర్శించుకుంటారు. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండగా, భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ను తేవాల్సిందేనని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.