మధ్యప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం... గుట్టలు గుట్టలుగా చచ్చిపడుతున్న కాకులు!
- నేల రాలుతున్న కాకులు
- వారం రోజుల వ్యవధిలో వందల కాకుల మృతి
- నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు
- ఏవియన్ ఫ్లూ అని తేలిన వైనం
ఒక్క ఇండోర్ లోనే ఓ కాలేజి వద్ద 145 కాకులు చచ్చిపడి ఉండడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మందసౌర్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ గడచిన 3 రోజుల వ్యవధిలో 200 కాకులు విగతజీవుల్లా మారిపోయాయి. ఖర్గోనే జిల్లాలోని కస్రావాడ్ ప్రాంతంలో రెండ్రోజుల్లో 20 కాకులు మృతి చెందాయి. దీనిపై వెటర్నరీ వర్గాలు, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఏవియన్ ఫ్లూ మనుషులకు సోకినట్టు ఎక్కడా వెల్లడి కాలేదు.