గంగూలీతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ
- ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీ
- దాదా ఆరోగ్య వివరాలు తెలుసుకున్న ప్రధాని
- గంగూలీ అర్ధాంగితోనూ ఫోన్ లో మాట్లాడిన వైనం
- నిలకడగా గంగూలీ ఆరోగ్యం
ఛాతీలో కొద్దిపాటి నొప్పితో గంగూలీ శనివారం ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి, తల భారంగా ఉండడం, వాంతులు, మగతగా ఉండడం వంటి లక్షణాలతో బాధపడ్డారు. ట్రెడ్ మిల్ పై కసరత్తులు చేస్తుండగా ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దాంతో వెంటనే కోల్ కతాలోని వుడ్ లాండ్స్ ఆసుపత్రిలో చేరారు. గంగూలీకి అక్కడి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.