అశోక్ గజపతి రాజును తొలగించారు.. మరి సుబ్బారెడ్డిని ఎందుకు తొలగించలేదు?: వర్ల రామయ్య
- ఆలయాల పర్యవేక్షణ సరిగా లేదన్నారు
- వంశపారంపర్య ట్రస్టీ అయిన అశోక్ గజపతి రాజును తొలగించారు
- మరి బెజవాడ అమ్మవారి మూడు సింహాలు చోరీ అయితే చర్యలేవీ?
- టీటీడీలో అశ్లీల ప్రవాహం జరిగినప్పుడు చర్యలు తీసుకోలేదు
'ముఖ్యమంత్రి గారూ! ఆలయాల పర్యవేక్షణ సరిగా లేదని వంశపారంపర్య ట్రస్టీ అయిన అశోక్ గజపతి రాజును తొలగించారు. మరీ, బెజవాడ అమ్మవారి మూడు సింహాలు దొంగిలించబడినందుకు, అంతర్వేది రథం దగ్ధమైనందుకు మంత్రి వెలంపల్లిని, టీటీడీలో అశ్లీల ప్రవాహం జరిగినప్పుడు సుబ్బారెడ్డిని ఎందుకు తొలగించలేదు?' అని వర్ల రామయ్య నిలదీశారు.