15 ఏళ్ల తరువాత ఢిల్లీలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత... 1.1 డిగ్రీలకు వేడిమి!
- 2006 తరువాత అతి తక్కువ ఉష్ణోగ్రత
- దట్టమైన పొగమంచుతో శూన్యానికి విజబిలిటీ
- వెల్లడించిన ఐఎండీ హెడ్ కులదీప్ శ్రీవాత్సవ
పొగమంచు కారణంగా విజబిలిటీ శూన్యమైందని తెలిపిన ఆయన, కనీసం 50 మీటర్ల దూరంలోని వాహనాలను సైతం చూసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులు ఉష్ణోగ్రతను కనిష్ఠానికి చేర్చాయని, ఈ పరిస్థితి 6వ తారీకు వరకూ ఉంటుందని ఆ తరువాత ఉష్ణోగ్రత 8 డిగ్రీల వరకూ పెరగవచ్చని అంచనా వేశారు. వేడి పెరిగినా, చలి తీవ్రత మాత్రం కొనసాగుతుందని తెలిపారు.