దుల్ఖర్, కాజల్ జంటగా 'హే సినామికా'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుల్ఖర్, కాజల్ జంటగా 'హే సినామికా'!

Brunda Gopal directs Hey Sinamika
  • దర్శకురాలిగా కొరియోగ్రాఫర్ బృంద 
  • మరో నాయికగా అదితీరావు హైదరి
  • తాజాగా షూటింగ్ మొత్తం పూర్తి
  • తమిళ, తెలుగు, మలయాళంలో రిలీజ్  
ఇటీవలి కాలంలో నృత్య దర్శకులు కూడా ఎక్కువగా దర్శకులుగా మారుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. వీరిలో సత్తా వున్న వారు దర్శకులుగా రాణిస్తున్నారు కూడా. ప్రభుదేవా, లారెన్స్ వంటి నృత్య దర్శకులు డైరెక్టర్లుగా కూడా బాగా సక్సెస్ అయ్యారు. ఇదే కోవలో ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద గోపాల్ కూడా డైరెక్టర్ గా మారింది. 'హే సినామికా' పేరుతో ఆమె తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

'మహానటి' ఫేమ్ దుల్ఖర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దాంతో పాటు సెట్లో తీసిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.

త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసి, వచ్చే ఏడాది చిత్రాన్ని రిలీజ్ చేస్తారు. ఈ చిత్రంలో ఇంకా కె.భాగ్యరాజా, సుహాసిని, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మలయాళ భాషల్లో కూడా దీనిని విడుదల చేస్తారు.
Dulkhar
Kajal Agarwal
Aditi Rao
Brinda

More Telugu News