సచిన్ తనయుడి బౌలింగ్ ను చితకబాదిన సూర్యకుమార్ యాదవ్
- త్వరలోనే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
- ముంబయిలో సన్నాహక మ్యాచ్ లు
- బీ- టీమ్, డీ-టీమ్ మధ్య మ్యాచ్
- 47 బంతుల్లోనే 120 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్
- అర్జున్ టెండూల్కర్ వేసిన ఓవర్లో 21 రన్స్ చేసిన వైనం
అర్జున్ విసిరిన ఓ ఓవర్లో సూర్య శివాలెత్తాడు. ఆ ఓవర్లో 21 పరుగులు పిండుకున్నాడు. అప్పటివరకు ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసిన అర్జున్ ఆ ఓవర్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తమ్మీద ఈ టీ20 మ్యాచ్ లో అర్జున్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులిచ్చాడు. ఓ వికెట్ కూడా తీశాడు.