అయ్యా డీజీపీ సవాంగ్ గారు.. మరోసారి హైకోర్టు నుంచి పిలుపు మీకు తప్పదేమో?: వర్ల రామయ్య
- గుంటూరు పోలీసులు ద్విచక్ర వాహనాలకు అధికార పార్టీ రంగులు వేశారు
- గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇదే రంగులు వేశారు
- వారికి రంగు పడింది
‘అయ్యా.. డీజీపీ సవాంగ్ గారు, గుంటూరు పోలీసులు ద్విచక్ర వాహనాలకు అధికార పార్టీ రంగులు వేసి వారి స్వామి భక్తి చాటుకున్నారు. గతంలో, ప్రభుత్వ కార్యాలయాలకు ఇదే రంగులు వేస్తే, వారికి రంగు పడింది. ఇప్పుడు, ఈ పోలీసు వాహనాలకు ఆ రంగులు తొలగించకపోతే, మరోసారి హైకోర్టు పిలుపు మీకు తప్పదేమో?’ అని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.