తెలుగు టీవీ ప్రేక్షకుల ముందుకు రానున్న చారిత్రక సీరియల్!

22-12-2020 Tue 09:39 | Entertainment
  • స్టార్ మాలో ప్రసారం కానున్న రుద్రమదేవి
  • ఇటీవలే ప్రోమోను విడుదల చేసిన నాగార్జున
  • తెలుగు జీఈసీల్లో తొలి చారిత్రక సీరియల్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరో చారిత్రక ధారావాహిక అలరించనుంది. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా రూపొందిన సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారం కానుంది. తెలుగు జీఈసీ (జనరల్ ఎంటర్ టెయిన్ మెంట్ చానెల్స్)ల్లో తొలి చారిత్రాత్మక కథనం ఇదేనని ఈ సందర్భంగా స్టార్ మా తరఫున హీరో నాగార్జున మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేలో సీరియల్ 'రుద్రమదేవి - సాటిలేని మహారాజు' ప్రోమోను ఆయన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ ప్రోమో వైరల్ అయింది. తెలుగు టీవీ చరిత్రలో అత్యధికంగా గ్రాఫిక్స్ ను వాడుతూ దీన్ని తీసినట్టు మాటీవీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాణి రుద్రమదేవి కథ చరిత్రలో అసమానమైనదని, యువరాణిగా రాజకుటుంబంలో జన్మించిన ఆమె, యుద్ధ విద్యలలో శిక్షణ పొంది, సింహాసనాన్ని దుష్టశక్తుల బారినపడకుండా  కాపాడుకుందని, అదే కథాంశంతో ఈ సీరియల్ ను రూపొందించామని అన్నారు.

మహిళలకు రాజ్యాధికారం పట్ల సమాజంలో ఉన్న భావనలను పోగొట్టడమే కాదు, చక్రవర్తిగానూ ఆమె అసమాన పోరాట పటిమ చూపుతూ అపారమైన రాజకీయ పరిపాలనను తన తండ్రి గణపతిదేవుడి నుంచి సొంతం చేసుకున్నదని అన్నారు. స్ఫూర్తిదాయక మరియు వినోదాల మేళవింపుతో దీన్ని తయారు చేసి, ప్రేక్షకులకు అందిస్తున్నామని తెలిపారు.
NagarjunaRudramadeviTelugu GECSeriel

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more