షాపింగ్ మాల్‌లో హీరోయిన్‌ను వేధించిన యువకుల ఫొటోలను విడుదల చేసిన పోలీసులు
Add ap7am to your home Screen

షాపింగ్ మాల్‌లో హీరోయిన్‌ను వేధించిన యువకుల ఫొటోలను విడుదల చేసిన పోలీసులు

Police release pics of men who allegedly molested actor
  • మలయాళీ హీరోయిన్ అన్నా బెన్‌తో కొందరు యువకులు అసభ్య ప్రవర్తన
  • సామాజిక మాధ్యమాల్లో చెప్పిన నటి
  • సుమోటాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఇటీవల మలయాళీ  హీరోయిన్ అన్నా బెన్‌తో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించంతో ఆమె ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో దీనిపై సుమోటాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుల ఫొటోలను గుర్తించి, విడుదల చేశారు.

ఫ్యామిలీతో కలిసి అన్నాబెన్ షాపింగ్‌కి వెళ్లిన సమయంలో యువకులు అసభ్యకర రీతిలో ప్రవర్తించారు. దీంతో ఇద్దరు నిందితుల చెంపఛెళ్లుమనిపించాలనుకున్నట్లు ఆమె తెలిపింది. అయితే, తనకు దొరకకుండా వారు పారిపోయారని చెప్పింది. ఈ నేపథ్యంలోనే అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుల ఫొటోలను తీశారు.‌ పోలీసుల వెబ్‌సైట్‌లోనూ నిందితులు  ఫొటోలను అప్‌లోడ్ చేశారు.


Police
Kerala
Crime News

More Telugu News