Budda Venkanna: అమరావతి భవనాల పైనుంచి దూకాలి... కాళ్లు విరిగి నాలుక బయటకు వస్తే అవి నిజమైన భవనాలు: విజయసాయికి బుద్ధా ఛాలెంజ్

Budda Venkanna challenges Vijayasai Reddy
  • అమరావతికి ఏడాది సందర్భంగా విజయసాయికి చాలెంజ్
  • అమరావతి భవనాలు గ్రాఫిక్స్ అంటున్నారని వ్యాఖ్యలు
  • ఫేక్ బ్యాచ్ కి నిరూపించి చూపాలంటూ సవాల్
  • కాళ్లు విరగకపోతే గ్రాఫిక్సేనన్న బుద్ధా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తాజాగా ఓ ఛాలెంజ్ విసిరారు. 'వీసా రెడ్డి... అమరావతి ఉద్యమం ఏడాది అవుతున్న సందర్భంగా నీకు ఒక ఛాలెంజ్' అంటూ ట్వీట్ చేశారు. "అమరావతిని గ్రాఫిక్స్ అంటున్నావు కదా... ఒకవేళ అవి గ్రాఫిక్స్ అయితే ఆ భవనాల పైనుంచి దూకి నీ ఫేక్ బ్యాచ్ కు చూపించు. నీ కాళ్లు విరగకపోతే అవి గ్రాఫిక్స్. నీ కాళ్లు విరిగిపోయి నాలుక బయటకు వస్తే అవి నిజమైన భవనాల కింద లెక్క. మరి దీనికి సిద్ధమేనా?" అంటూ సవాల్ విసిరారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Challenge
Amaravati
Buildings

More Telugu News