మొదటి డేటింగ్ లోనే ముద్దిస్తానా ఏంటి? ఊరించి వెంటపడేలా చేస్తా: కియారా అడ్వాణీ
- నా ఫస్ట్ క్రష్ విఫలమైంది
- ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నా
- ఫీచర్ మూవీస్ చేయాలని ఉందన్న కియారా
తాను ప్రస్తుతానికి సింగిల్ గానే ఉన్నానని, అయితే, ఏదో ఒక సమయంలో ఎవరితోనే ఒకరితో కలవాల్సిందేనని చెప్పింది. మనసుకు నచ్చిన వారితోనే డేటింగ్ చేయాలని నమ్ముతానని, ఒకవేళ తనకు అలా నచ్చి, డేటింగ్ వెళితే, తొలిసారి బయటకు వెళ్లినప్పుడే ముద్దిచ్చే ప్రసక్తే లేదని కుండ బద్ధలు కొట్టింది. అతన్ని ఊరించి, తన వెంటపడేలా చేసుకుంటానని, ఆ తరువాతే ముద్దులని చెప్పేసింది. తనకు సోషలిజంతో కూడిన పాత్రలు చేయాలంటే ఇష్టం ఉండదని, యూఎస్ షోస్ ఎక్కువగా చూసే తనకు అటువంటి కథలతో ఫీచర్ మూవీ చేయాలని ఉందని చెప్పింది.