మెగా ఫ్యామిలీలో మగవాళ్లందరూ ఒకే ఫ్రేములో... వైరల్ అవుతున్న పిక్ ఇదే!

Mega people in single frame at Niharika and Chaitanya wedding
  • నిహారిక పెళ్లికి తరలివచ్చిన మెగా జనం
  • ఉదయ్ పూర్ లో నిహారిక, చైతన్య వివాహం
  • గ్రూప్ ఫొటో తీయించుకున్న చిరంజీవి, పవన్ తదితరులు
  • ఫొటోలో కనిపిస్తున్న బన్నీ, చరణ్
  • అందరికంటే పొడవుగా అకీరా
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి ఈ నెల 9న రాజస్థాన్ లోని చారిత్రక పట్టణం ఉదయ్ పూర్ లో జరిగింది. మాజీ ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహ వేడుక కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్ కోటలో కొలువు దీరింది. ఈ సందర్భంగా కొత్త పెళ్లికొడుకు చైతన్యతో సహా మెగా ఫ్యామిలీలోని మగవాళ్లందరూ ఓ ఫొటో తీయించుకున్నారు. ఇప్పుడా ఫొటో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు ఒకే ఫ్రేములో ఉండడం అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది. ఈ ఫొటోలో అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, శిరీష్, వెంకట్, కల్యాణ్ దేవ్ తదితరులున్నారు.

ఇక, ఈ ఫొటోలో ఉన్న అందరిలోకి పొడగరి మాత్రం పవన్ కల్యాణ్ తనయుడు అకీరానే. చిన్న వయసులోనే ఆరడుగులకు పైగా పొడవు పెరిగిన అకీరా ఈ గ్రూప్ ఫొటోలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు. అకీరా హైట్ పై సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య చర్చ నడుస్తోంది.
Go Back to Shorts
Mega People
Chiranjeevi
Pawan Kalyan
Nagababu
Allu Arjun
Ramcharan
Akira

More Telugu News