యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్‌ను ప్రకటిస్తే మద్దతిస్తాం: శివసేన
- కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడింది
- యూపీఏ బాధ్యతలను స్వీకరించడానికి పవార్ సిద్ధంగా లేరని తెలిసింది
- యూపీఏను బలపరచడానికి ప్రతిపక్షాలన్నీ ముందుకు రావాలి
అయితే, యూపీఏ బాధ్యతలను స్వీకరించడానికి పవార్ సిద్ధంగా లేరని తనకు తెలిసిందని చెప్పారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టాలన్న ఈ అభ్యర్థన అధికారికంగా వస్తే మాత్రం దానికి తమ పార్టీ మద్దతిస్తుందని చెప్పారు. దేశంలో యూపీఏను బలపరచడానికి ప్రతిపక్షాలన్నీ ముందుకు రావాలని, ఆ సమయం వచ్చిందని తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరలోనే యూపీఏ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆమె శరద్ పవార్ పేరును ఆ పదవికి ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. తన స్థానంలో యూపీఏ చైర్మన్‌గా మరో నేతను ఎన్నుకోవాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది.