పోలైన ఓట్ల కంటే బాక్సులో ఎక్కువ ఓట్లు.. పలు చోట్ల బీజేపీ నేతల ఆందోళన
- వివేకానందనగర్ కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం
- అధికారుల తీరుపై బీజేపీ నేతల మండిపాటు
- ఆ డివిజన్లో మొత్తం 355 ఓట్లు పోలయ్యాయని ఇటీవల ప్రకటన
- బాక్సుల్లో మాత్రం 574 ఉన్నాయంటోన్న అధికారులు
ఈ విషయంపై ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సునీతకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తమ అభ్యంతరాన్ని లెక్కలోకి తీసుకోలేదని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు గోషామహల్ నియోజకవర్గంలోనూ ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. జాంబాగ్ డివిజన్లోని బూత్ నెంబర్ 8లో పోలైన ఓట్ల కంటే బాక్స్ లో ఉన్న ఓట్లు అధికమని తేలింది. అయితే, పోలింగ్ శాతమే తప్పుగా ప్రకటించారని అధికారులు చెబుతున్నారు.