బాలకృష్ణ తదుపరి చిత్రానికి దర్శకుడు శ్రీవాస్?
- గతంలో బాలయ్య, శ్రీవాస్ కాంబోలో 'డిక్టేటర్'
- ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న బాలకృష్ణ
- కోన వెంకట్ చెప్పిన కథకు బాలయ్య ఓకే
- బోయపాటి సినిమా తర్వాత ఇదే సెట్స్ కి
ప్రముఖ రచయిత కోన వెంకట్ ఇటీవల బాలకృష్ణను కలసి ఓ కథ వినిపించారట. అది బాలయ్యకు బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో దీనిని తన తదుపరి చిత్రంగా చేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలని శ్రీవాస్ కి బాలయ్య అప్పగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ ఏ బ్యానర్లో చేస్తారన్నది ఇంకా వెల్లడికాలేదు.