Prakash Raj: తాను పెద్ద మేధావినని ప్రకాశ్ రాజ్ ఫీలవుతుంటాడు: టాలీవుడ్ దర్శకుడు శ్రీధర్ రెడ్డి

sridhar reddy slams prakash raj
షార్ట్స్‌లో చూడండి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ తన అభిమానులను, కార్యకర్తలను అందరినీ బీజేపీకి ఓటేయాలని పవన్ కల్యాణ్ చెబుతున్నారని, అలాంటప్పుడు ఇక జనసేన పార్టీ ఎందుకని సినీనటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ పై జనసేన నేత, సినీనటుడు నాగబాబు విరుచుకుపడ్డారు. దీనిపై టాలీవుడ్ దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 ‘బాగా చెప్పారు సర్.. పెద్ద మేధావి అని ఫీలింగ్ ఆయనకు. ఆయన ఎల్లప్పుడూ దేశంలోని అసహనం గురించి మాట్లాడుతుంటాడు. కానీ, ఆయనలోనే ఎంతగా అసహనం ఉందో, ఆయన ఇతరులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తాడో సినీ పరిశ్రమలో ఉన్న మనందరికీ తెలుసు’ అని శ్రీధర్ రెడ్డి అన్నారు.
Go Back to Shorts
Prakash Raj
Tollywood
Janasena

More Telugu News