టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా!
- బ్యాటింగ్ కు మంచి వికెట్ అన్న ఫించ్
- నిలదొక్కుకుంటే మంచి స్కోర్ వస్తుందని వెల్లడి
- ఈ మ్యాచ్ తమకు చాలా ముఖ్యమన్న కోహ్లీ
ఆపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ తమ టీమ్ కు చాలా ముఖ్యమని, ఆటగాళ్లంతా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైందని, కలసికట్టుగా ఆడతామని అన్నారు. తొలి మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, చాలా రోజుల తరువాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతుందని అన్నాడు.
ఇండియా జట్టు: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మార్నస్, స్టోయినిస్, గ్లెన్ మాక్స్ వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజల్ వుడ్.