సంజయ్ సర్జికల్ స్ట్రయిక్స్ వ్యాఖ్యలపై పొంగులేటి సుధాకర్ రెడ్డి వివరణ
- అవినీతి, అక్రమ పాలనపైనే సర్జికల్ స్ట్రయిక్స్
- పాకిస్థాన్ కు మద్దతు పలుకుతున్న వారిపైనే సర్జికల్ స్ట్రయిక్స్
- కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు
బండి సంజయ్ చెప్పిన సర్జికల్ స్ట్రయిక్స్ అవినీతి, అక్రమ పాలన, చొరబాటుదారులపై ఉంటుందని పొంగులేటి చెప్పారు. హైదరాబాదులో ఉంటూ, ఇక్కడి గాలి పీల్చుతూ, ఇక్కడి తిండి తింటూ పాకిస్థాన్ కు మద్దతు పలుకుతున్న వారిపైనే సర్జికల్ స్ట్రయిక్స్ ఉంటాయని తెలిపారు. హైదరాబాదును విశ్వనగరంగా చేస్తామన్న టీఆర్ఎస్ పార్టీ... చివరకు విషాద నగరంగా మార్చిందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకునే పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని... అదొక మునిగిపోయే పార్టీ అని అన్నారు.