లైఫ్ లో ఈమాత్రం "ఆహా" ఉండాలి: ఓటీటీ యాడ్ లో అల్లు అర్జున్
- ఆహా యాప్ బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ
- ఆహా కోసం యాడ్ లో నటించిన వైనం
- సోషల్ మీడియాలో దూసుకుపోతున్న యాడ్
ఇందులో బన్నీ ఓ అమ్మాయి కోసం వాళ్ల ఇంటికి వెళతాడు. ఆ అమ్మాయితో గదిలో ఉండగా వాళ్ల నాన్న (మురళీశర్మ) రావడంతో బన్నీ కప్ బోర్డులో దాక్కుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి సోదరుడు కూడా వచ్చి గదిలో చెక్ చేస్తాడు. కానీ బన్నీ కనిపించడు.
వాళ్లిద్దరూ వెళ్లిన తర్వాత ఆ అమ్మాయి... "రాత్రంతా ఎలా కూర్చున్నావు బేబీ" అని అడుగుతుంది. అందుకు బన్నీ "ఆహా యాప్ లో కార్యక్రమాలు చూస్తూ గడిపేశాను" అని జవాబిస్తాడు. "లైఫ్ లో ఈ మాత్రం ఆహా ఉండాలి" అంటూ యాడ్ ను రక్తి కట్టించాడు. యాడ్ కాస్త వాడీవేడిగా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది.