Kakinada: కరోనాతో కన్నుమూసిన వైసీపీ కాకినాడ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్!

Kakinada YCP President Died With Corona
షార్ట్స్‌లో చూడండి
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు మహమ్మారి సోకడంతో, విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారు. పరిస్థితి విషమించి, పలు అవయవాలు దెబ్బతినడంతో, ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇటీవలే ఫ్రూటీ కుమార్ భార్య చంద్రకళా దీప్తికి ఫోన్ చేసిన వైఎస్ జగన్, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫ్రూటీ కుమార్ మరణంతో కాకినాడ వైసీపీ నేతల్లో విషాదం నెలకొంది. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారని పలువురు నేతలు కొనియాడారు. ఫ్రూటీ కుమార్ మృతిపట్ల మంత్రులు, జిల్లా నేతలు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Kakinada
East Godavari District
FrutyKumar
YSRCP
Corona Virus

More Telugu News