అర్నాబ్ గోస్వామికి 14 రోజుల రిమాండ్.. భౌతిక దాడి ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు
- ఆర్కిటెక్చర్ అన్వయ్, అతడి తల్లి ఆత్మహత్య కేసులో అర్నాబ్ అరెస్ట్
- బాధిత కుటుంబం అభ్యర్థనతో కేసును రీ ఓపెన్ చేసిన ఉద్ధవ్ ప్రభుత్వం
- నేడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం
అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో తమతో సహకరించాల్సిందిగా పోలీసులు పలుమార్లు అర్నాబ్‌ను కోరడం అందులో కనిపించింది. అయితే, అర్నాబ్ మాత్రం పోలీసులు తనపై దాడిచేసినట్టు ఆరోపిస్తున్నారు. కాగా, తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా అర్నాబ్ పెట్టుకున్న పిటిషన్‌ను నేడు బాంబే హైకోర్టు విచారించనుంది. అలాగే, బెయిలు కోసం కూడా ఆయన దరఖాస్తు చేసే అవకాశం ఉందని సమాచారం.