అన్నాడీఎంకే, డీఎంకేలతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన కమలహాసన్!
- ద్రావిడ పార్టీలతో పొత్తు ఆలోచన లేదు
- థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సత్తా మాకు మాత్రమే ఉంది
- జిల్లాల కార్యదర్శులతో సమావేశంలో కమల్
ద్రావిడ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన తనకు లేదని అన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సత్తా తమకు మాత్రమే ఉందని మిగతా పార్టీలన్నీ అంగీకరిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశానికి 112 నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు హాజరయ్యారు. వీరితో విడివిడిగా సమావేశమైన కమల్, నిన్నంతా మంతనాలు సాగించారు. మొత్తం 18 జిల్లాల శాఖల కార్యదర్శులు హాజరయ్యారని, మిగతా జిల్లాలతో మరో విడత సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.