సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- డ్రెస్ సెన్స్ గురించి చెప్పిన తమన్నా
- షూటింగులోకి దిగుతున్న బాలకృష్ణ
- 'స్టార్ మా' చేతిలో రెండు భారీ సినిమాలు
* బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రం తాజా షెడ్యూలు షూటింగు రేపటి నుంచి హైదరాబాదులో జరుగుతుందని తెలుస్తోంది. హీరో బాలకృష్ణ కూడా రేపు జాయిన్ అవుతారని సమాచారం. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ చాలావరకు జరిగింది.
* ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ 'స్టార్ మా' రెండు భారీ చిత్రాల శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట', అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రాల హక్కులను భారీ రేటు ఆఫర్ చేసి స్టార్ మా దక్కించుకున్నట్టు తెలుస్తోంది.