ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్ వెంటే అమెరికా: మైక్ పాంపియో స్పష్టీకరణ
- భారత పర్యటనకు వచ్చిన అమెరికా మంత్రి
- భారత్ కు దన్నుగా నిలుస్తామని హామీ
- భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరుచుకుంటామని వెల్లడి
మైక్ పాంపియో, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిరువురు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాల్వన్ లోయలో చైనాతో ఘర్షణల్లో అమరులైన భారత జవాన్లకు నివాళులు అర్పించారు.