గురితప్పని బ్రహ్మోస్... తాజా ప్రయోగం విజయవంతం
- యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ ప్రయోగం
- అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని ఛేదించిన బ్రహ్మోస్
- డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్ నాథ్ సింగ్
ఈ ప్రయోగం ఆసాంతం బ్రహ్మోస్ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉందని, గాల్లోకి లేచింది మొదలు లక్ష్యాన్ని తాకే వరకు అన్ని దశల్లోనూ ఇది సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రహ్మోస్ తాజా వెర్షన్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇకపై భారత యుద్ధనౌకలు కూడా శత్రు భీకర వేదికలు కానున్నాయి.
తాజా ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీశ్ రెడ్డి కూడా తమ శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేర్ల నుంచి బ్రహ్మోస్ పేరు ఉద్భవించింది.