శోభానాయుడు లేరని తెలిసి ఎంతో బాధకు గురయ్యాను: చిరంజీవి
- తన సాంస్కృతిక వారసత్వాన్ని ఎందరికో పంచారు
- తన జీవితాన్ని కూచిపూడికే అంకితం చేశారు
- ఆమెతో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది
ఆమె లేని లోటు మనతో పాటు సాంస్కృతిక సమాజానికి తీరని లోటు అని అన్నారు. శ్రీ వెంపటి చిన సత్యంగారి శిష్యురాలిగా ఆయన వారసత్వాన్ని ఎంతో ఘనంగా కొనసాగించారని కితాబునిచ్చారు. తన సాంస్కృతిక వారసత్వాన్ని ఎందరికో పంచారని... ఎందరో కూచిపూడి నృత్యకారులను తయారు చేశారని కొనియాడారు. శోభానాయుడు గారితో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.