27 ఏళ్లుగా హీరో విజయ్‌ కాపాడుకుంటోన్న రికార్డుకి ఈ ఏడాది బ్రేక్!
Add ap7am to your home Screen

27 ఏళ్లుగా హీరో విజయ్‌ కాపాడుకుంటోన్న రికార్డుకి ఈ ఏడాది బ్రేక్!

vijay record break
  • ‘మాస్టర్’ ఈ ఏడాది విడుదల కాదన్న నిర్మాతలు
  • ఫ్యాన్స్ తీవ్ర నిరాశ
  • 27 ఏళ్లుగా ప్రతి ఏడాది విజయ్ ఒక్క సినిమా అయినా విడుదల
  • ఈ సారి మాత్రం నో చాన్స్
తమిళ హీరో విజయ్ నటించిన కొత్త సినిమా ‘మాస్టర్’ ఈ ఏడాది విడుదల కాదని నిర్మాతలు స్పష్టం చేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఎందుకంటే నిర్మాతలు తీసుకున్న నిర్ణయం వల్ల విజయ్ పేరుతో ఉన్న ఓ అరుదైన రికార్డుకు ఆటంకం ఏర్పడింది. ఆ హీరో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 27ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన సినిమా రంగానికి వచ్చినప్పటి నుంచి ఏడాదికి కనీసం రెండు లేక మూడు సినిమాలు విడుదల చేస్తున్నాడు.

27 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో ఆయన సినిమా విడుదల కాని సంవత్సరం అంటూ ఒక్కటి కూడా లేదు. మాస్టర్ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్నప్పటికీ, కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్, కొవిడ్ నిబంధనల పర్యవసానంగా బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉండడంతో ఈ సినిమా విడుదలకు ఆ సినిమా యూనిట్ వెనకడుగు వేస్తోంది. ‘మాస్టర్’ సినిమాను క్రిస్మస్ కానుకగా అయినా విడుదల చేస్తారని మొదట అభిమానులు భావించారు. అయితే, అందుకు కూడా నిర్మాతలు ఒప్పుకోలేదు. దీంతో విజయ్ మీదున్న ఈ అరుదైన రికార్డు ఇక్కడితో ఆగిపోనుంది.
vijay
Tamilnadu

More Telugu News