'టక్ జగదీష్' షూటింగ్ మొదలు.. జాయిన్ అయిన నాని!
- శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్'
- హీరోయిన్లుగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్
- లాక్ డౌన్ కి ముందు నలభై శాతం షూటింగ్
ఈ క్రమంలో నాని కూడా తన తాజా చిత్రం షూటింగును మొదలెట్టాడు. 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా 'టక్ జగదీష్' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన నలభై శాతం షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ తో బ్రేక్ పడింది.
తిరిగి ఈ రోజు నుంచి హైదరాబాదులో ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తున్నారు. నాని కూడా ఈ రోజు షూటింగులో పాల్గొన్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు.