ముమైత్ ఖాన్ నన్ను మోసం చేసింది: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్
- గోవాకు మూడు రోజులకు క్యాబ్ బుక్ చేసుకుంది
- అక్కడకు వెళ్లాక ఎనిమిది రోజులకు పొడిగించింది
- డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయింది
కిరాయి వస్తుందనే ఆశతో తనకు తాను సర్ది చెప్పుకున్నానని... కానీ, ఎనిమిది రోజులు అయిన తర్వాత తనకు డబ్బులు ఇవ్వకుండా ఆమె వెళ్లిపోయిందని రాజు తెలిపాడు. టోల్ గేట్, అకామడేషన్ డబ్బులు కూడా ఇవ్వలేదని... ఆమె నుంచి తనకు రూ. 15 వేలు రావాలని చెప్పాడు. మరో డ్రైవర్ తన మాదిరి సెలబ్రిటీల చేతిలో మోసపోకూడదనే ఈ విషయాన్ని మీడియా వరకు తీసుకొచ్చానని... పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. టోల్ గేట్ పేమెంట్ రసీదులు, తన మొబైల్ కి ముమైత్ పంపించిన గోవా అడ్రస్ తనకు ఆధారాలని చెప్పాడు.