చంద్రబాబు లేఖకు సమాధానం ఇచ్చిన ఏపీ డీజీపీ సవాంగ్!

AP DGP Reply to Chandrababu Open Letter
  • నిజానిజాలు తెలుసుకోకుండా లేఖలు సరికాదు
  • ఆధారాలు ఉంటే సీల్డ్ కవర్ లో పంపించండి
  • విచారించి చర్యలు తీసుకుంటామన్న సవాంగ్
నిజానిజాలు తెలుసుకోకుండా బహిరంగ లేఖలు రాయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో లేఖ రాశారు. న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి జరిగిన తరువాత, ఆ దాడి చేసింది వైసీపీ నేతలేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆరోపిస్తూ, చంద్రబాబు లేక రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సవాంగ్, మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, సీల్డ్ కవర్ లో తనకు పంపాలని కోరారు. మీడియా రూపంలో లేఖలు విడుదల చేయడం తగదని, అలా చేస్తే, జరుగుతున్న విచారణకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఆధారాలు నిజమైతే, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Gautam Sawang
Chandrababu
Letter
Reply

More Telugu News