Puri Jagannadh: మహేశ్ బాబు సార్.. మీ నుంచి గ్రీటింగ్స్ అందుకోవడం సంతోషంగా ఉంది: పూరి జగన్నాథ్

ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే గ్రీటింగ్స్ చెపుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సందర్బంగా పూరీ జగన్నాథ్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'తన అభిమాన దర్శకుల్లో ఒకరైన పూరీ జగన్నాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పటి మాదిరే సంతోషంగా ఉంటూ, మరెన్నో విజయాలను  సాధించాలి' అని ట్వీట్ చేశారు.

మహేశ్ ట్వీట్ పట్ల పూరి జగన్నాథ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'మహేశ్ సార్.. మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. లవ్యూ ఆల్వేస్' అని సమాధానమిచ్చారు.
Puri Jagannadh
Mahesh Babu
Tollywood

More Telugu News