ముంబైలో దొరికిన యూపీ గ్యాంగ్‌స్టర్.. లక్నోకు తీసుకొస్తుండగా ప్రమాదంలో మృతి
- పోలీసుల కళ్లుగప్పి ముంబై పారిపోయిన గ్యాంగ్‌స్టర్
- ఆవును తప్పించే క్రమంలో ప్రమాదం
- ప్రమాదంలో ఫిరోజ్ బావ చేయికి తీవ్ర గాయం
ముంబైలో ఫిరోజ్, అతడి బావ అఫ్జల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కారులో లక్నోకు తీసుకొస్తుండగా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా సమీపంలో ఆవును తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫిరోజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. అఫ్జల్ చేయి విరిగినట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై రాజేశ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు.