మావోయిస్టుల కిరాతకం.. 16 మంది గ్రామస్తులను హత్య చేసిన వైనం!
- ఇటీవల 25 మందిని అపహరించిన మావోలు
- ప్రజా కోర్టులో నలుగురి హత్య
- అనంతరం ఐదుగురి విడుదల
ఇటీవలే 25 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించారు. ఆ తర్వాత ప్రజా కోర్టు నిర్వహించి నలుగురి గొంతులు కోసి హతమార్చారు. అనంతరం ఐదుగురిని విడుదల చేశారు. తమ ఆధీనంలోనే ఉంచుకున్న మిగతా 16 మందిని ఈరోజు హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్తతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.