యూఏఈకి వచ్చేసిన కరోనా వ్యాక్సిన్... తొలి డోస్ తీసుకున్న ఆరోగ్య మంత్రి!
- ప్రస్తుతం మూడవ దశలో వ్యాక్సిన్
- హెల్త్ వర్కర్లకు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం
- ప్రజలను రక్షిస్తామన్న యూఏఈ మంత్రి
యూఏఈ ఆరోగ్య శాఖా మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్, ఈ వ్యాక్సిన్ తొలి డోస్ ను తీసుకున్నారు. దీని ట్రయల్స్ లో ఎలాంటి దుష్పరిణామాలూ సంభవించలేదని, ఈ కారణంగానే తాను టీకాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. దేశ ప్రజలను రక్షించడంలో తాము ముందుంటామని, ఈ వ్యాక్సిన్ ను కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ముందుగా ఇస్తామని అన్నారు.
కాగా యూఏఈలోని అబూదాబిలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ మూడవ దశ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను దేశంలోని 125 దేశాలకు చెందిన 31 వేల మందిపై ప్రయోగించి, ఫలితాలను వైద్యాధికారులు సమీక్షిస్తున్నారు.