మరోమారు లాక్‌డౌన్‌కు సిద్ధమవుతున్న యూకే!
- జులై, ఆగస్టులో తగ్గుముఖం పట్టిన కేసులు
- ప్రస్తుతం ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతున్న వైనం
- రోజుకు 6 వేల కేసులు వెలుగులోకి
ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతుండడంతో తప్పనిసరైతే మరోమారు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్ తెలిపారు. అయితే, ఈ విషయంలో వచ్చేవారం నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. కనీసం పబ్బులు, రెస్టారెంట్లు, క్లబ్ లపైన అయినా ఆంక్షలు విధిస్తామన్నారు. కాగా, ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల కేసులు నమోదు కాగా, 42 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.