తీవ్ర సంక్షోభంలో దక్షిణాఫ్రికా క్రికెట్.. ఒలింపిక్ బాడీ చేతిలోకి క్రికెట్ బోర్డు
- సీఎస్‌ఏను తమ నియంత్రణలోకి తీసుకున్న ఒలింపిక్ కమిటీ
- ఇప్పటికే అవినీతి, జాతి వివక్ష ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి
- ఎస్ఏఎస్‌సీఓసీ నిర్ణయాన్ని అంగీకరించబోమన్న బోర్డు
ఇప్పటికే అవినీతి, జాతి వివక్ష ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఒలింపిక్ కమిటీ నిర్ణయం శరాఘాతం కానుంది. ఎస్ఏఎస్‌సీఓసీ తాజా నిర్ణయం కారణంగా సీఈవో కుగాండ్రీ గోవేందర్, కంపెనీ కార్యదర్శి వెల్స్ గ్వాజా, తాత్కాలిక సీసీవో థేమీ తెంబు వంటి వారు దూరం కానున్నారు. దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో తబాంగ్ మోన్రోపై గత నెలలోనే వేటుపడగా, ఆ వెంటనే తాత్కాలిక సీఈవో జాక్వెస్ ఫాల్, అద్యక్షుడు క్రిస్ నెంజానీ రాజీనామా చేశారు. అయితే, ఒలింపిక్ కమిటీ నిర్ణయాన్ని అంగీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది.