దుబాయ్ లాటరీలో తెలంగాణ ఐటీ ఇంజినీర్ కు బంపర్ ప్రైజ్!
- రూ.7.3 కోట్ల లాటరీ దక్కించుకున్న తాతారావు
- దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం
- తన కుటుంబం పరిస్థితి మారిపోతుందంటున్న తెలంగాణ టెక్కీ
లాటరీ కొట్టిన ఆ వ్యక్తి పేరు గ్రంథి వెంకట లక్ష్మీతాతారావు. 37 ఏళ్ల తాతారావు దుబాయ్ లోని ఓ ఐటీ సంస్థలో ఏడాదిగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తనకే మొదటి బహుమతి రావడంతో తాతారావు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ లాటరీ మొత్తంతో భారత్ లో ఉన్న తన కుటుంబం పరిస్థితి మారిపోతుందని ఆనందంగా చెప్పాడు.
కాగా, యూఏఈలో 1999లో మిలినీయం మిలియనర్ ప్రమోషన్ లాటరీ ప్రారంభం కాగా, తాతారావు సహా 168 మంది భారతీయులు ఈ లాటరీ గెలుచుకోవడం విశేషం అని చెప్పాలి.