తెలంగాణ ఎస్ఈసీగా పార్థసారథి నియామకం
Add ap7am to your home Screen

తెలంగాణ ఎస్ఈసీగా పార్థసారథి నియామకం

Parthasarathi appointed as TS SEC
  • 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి
  • ఆదిలాబాద్ డీఆర్డీఏ పీడీగా కెరీర్ ప్రారంభం
  • ఏప్రిల్ లో పదవీ విరమణ చేసిన నాగిరెడ్డి
తెలంగాణ రాష్ట్ర నూతన ఎన్నికల ప్రధాన అధికారిగా మాజీ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చేసిన పార్థసారథి...1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆదిలాబాద్ జిల్లా డీఆర్డీఏ పీడీగా తన కెరీర్ ను ప్రారంభించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నాగిరెడ్డిని నియమించింది. ఈ ఏప్రిల్ తో ఆయన ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. దీంతో, నూతన సీఈసీగా పార్థసారథిని నియమించారు.
Telangana
SEC
Parthasarathi

More Telugu News