తెలంగాణలో కరోనా విజృంభణ.. అప్‌డేట్స్‌ ‌
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా విజృంభణ.. అప్‌డేట్స్‌ ‌

new 2011  coronavirus cases in telangana
  • గత 24 గంటల్లో కొత్తగా 2,478 కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884
  • ఆసుపత్రుల్లో 32,994  మందికి చికిత్స
  • 1,02,024 మంది డిశ్చార్జ్  
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,478 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,011  మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,994  మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,02,024 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 866కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి.  
       
Corona Virus
COVID-19
Telangana

More Telugu News