చెన్నై సూపర్ కింగ్స్ కు ఊరట... శిబిరంలో అందరికీ కరోనా నెగెటివ్
- ఇటీవల సూపర్ కింగ్స్ శిబిరంలో కరోనా కలకలం
- ఆటగాళ్లతో సహా సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్
- తాజా పరీక్షల్లో అందరికీ నెగెటివ్
- సెప్టెంబరు 5 నుంచి ప్రాక్టీస్!
తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో చెన్నై శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఇక టోర్నీ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు మరోసారి కరోనా టెస్టులు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 5 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సాధన ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇటీవలే సురేశ్ రైనా యూఏఈ నుంచి అర్థాంతరంగా వచ్చేయడంతో అతడి స్థానం ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. చెన్నై జట్టులో ధోనీ, బ్రావో తర్వాత రైనా కీలక ఆటగాడు అన్న సంగతి తెలిసిందే.