తెలంగాణలో మరో 2,734 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో మరో 2,734 కరోనా కేసులు

new 2734  coronavirus cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,27,697
  • ఆసుపత్రుల్లో 31,699 మందికి చికిత్స
  • 95,162 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 836
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,734  కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,325 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,27,697కు చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 31,699 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 95,162  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 836కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 347 కరోనా కేసులు నమోదయ్యాయి.
             
Corona Virus
COVID-19
Telangana

More Telugu News