ఒక అమ్మాయి కోసం.. గ్రామం మొత్తానికి వైఫై సౌకర్యం కలిపించిన సోను సూద్!
Add ap7am to your home Screen

ఒక అమ్మాయి కోసం.. గ్రామం మొత్తానికి వైఫై సౌకర్యం కలిపించిన సోను సూద్!

sonu sood helps poor student
  • ఓ విద్యార్థిని 2 కిలోమీటర్ల దూరంలోని కొండపైకి వెళ్లి చదువు
  • అక్కడే చిన్నగుడిసె వేసుకున్న విద్యార్థిని
  • మహారాష్ట్రలోని ఆమె గ్రామానికి సోను ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం
సాయం కోరిన వెంటనే ప్రతి స్పందిస్తూ పెద్ద మనసు చాటుకుంటూ రియల్ హీరో అనిపించుకుంటోన్న సినీనటుడు సోను సూద్ తాజాగా ఓ గ్రామానికి సాయం చేశాడు.‌ మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ కు చెందిన స్వాప్నిల్ అనే విద్యార్థిని తన గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపైకి వెళ్లి చిన్నగుడిసె వేసుకుని అక్కడే చదువుకుంటోంది.

ఆన్‌లైన్‌ తరగతులు వినడానికి ఆమె గ్రామానికి ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోవడమే అందుకు కారణం. ఆమె సోదరుడి సాయంతో అక్కడ చదువుకుని సాయంత్రానికి ఇంటికి వస్తోంది. ఆమె ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతోందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సోను సూద్ ఆమెతో పాటు ఆమె ఉంటోన్న ఊరి మొత్తానికి సాయం చేస్తున్నాడు.

ఆ గ్రామానికి ఉచితంగా వైఫై సౌకర్యం కల్పిస్తానని చెప్పాడు. సోను సూద్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా, ఆ  విద్యార్థిని ఓ చిన్న గుడిసెలో చదువుకుంటోన్న ఫొటోను ఒకరు పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది.
Sonu Sood
Tollywood
Bollywood

More Telugu News