Venkatesh: వెంకటేశ్ 75వ చిత్రానికి సన్నాహాలు.. త్రివిక్రమ్ దర్శకత్వం?

Trivikram to direct Venkatesh
  • వెంకటేశ్ చేస్తున్న 'నారప్ప' 74వ చిత్రం 
  • ఇప్పటికే కథను సిద్ధం చేసిన త్రివిక్రమ్ 
  • ఎన్టీఆర్ తో కన్నా ముందుగానే వెంకీ సినిమా 
మొదటి నుంచీ వినూత్నమైన కథాంశాలను ఎంచుకుంటూ.. విభిన్న తరహా చిత్రాలు చేస్తూ.. ఇన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న హీరో వెంకటేశ్ ఇప్పటికి 73 సినిమాలు చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న 'నారప్ప' 74వ చిత్రం. ఈ క్రమంలో ఆ తర్వాత నటించే 75వ చిత్రం గురించి గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఫలానా దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం వెంకీ నటించే ఈ మైల్ స్టోన్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన కథను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేశారని అంటున్నారు. దీనికి వెంకీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సివుంది. అయితే, దానికి ఇంకా కాస్త సమయం ఉన్నందున ముందుగా వెంకీ చిత్రాన్ని త్రివిక్రమ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

More Telugu News

Venkatesh
Trivikram Srinivas
Narappa
Srikanth Addala