కృష్ణా బోర్డు ఇచ్చిన ఈ ఆదేశాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం డ్యాంలోకి వరద
- అయినా పోతిరెడ్డిపాడుకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు
- కేవలం మద్రాసుకు తాగునీటి కోసం తెలుగుగంగకు 9 టీఎంసీలా?
- దాంతో ఆపేయమని కృష్ణా బోర్డు ఆదేశాలివ్వడం ఏంటీ?
'కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం, వెనుకబడిన రాయలసీమలో సాగు, తాగునీటి ఆవశ్యకతను వివరించడంలో విఫలమవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని నా అభిప్రాయం. వెంటనే పోతిరెడ్డిపాడుకు పూర్తి స్థాయిలో నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నా' అని సోమిరెడ్డి పేర్కొన్నారు.