అభిమానుల నిరీక్షణ ఫలిస్తోంది.. చాలా కాలం తర్వాత కలిసి నటించనున్న నట దిగ్గజాలు!
- కెరీర్ తొలినాళ్లలో కలిసి నటించిన కమల్, రజనీ
- ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు
- రాజ్ కమల్ బ్యానర్ పై సినిమా తెరకెక్కే అవకాశం
అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టైమ్ వచ్చేసిందని తమిళ దర్శకుడు కనకరాజ్ తీపి కబురు అందించారు. రజనీ, కమల్ ఇద్దరూ నటించే చిత్రంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ప్రాథమిక దశ చర్చలు పూర్తయ్యాయని.. అంతా సవ్యంగా జరగితే అద్భుతం జరిగినట్టేనని ఆయన చెప్పారు. కమల్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ బ్యానర్ పై సినిమా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ చిత్రం బహు భాషల్లో తెరకెక్కే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ప్రకటనతో సినీ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుందనే అంచనాలు అప్పుడే ప్రారంభమయ్యాయి.