ఐపీఎల్ ముంగిట కరోనా పరీక్షలు చేయించుకున్న ధోనీ
- రాంచీలో ధోనీకి కరోనా టెస్టులు
- ఈ సాయంత్రం రానున్న వైద్య నివేదిక
- త్వరలోనే యూఏఈ బయల్దేరనున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు
ఈ పరీక్షల్లో నెగెటివ్ వస్తే ధోనీ చెన్నై వెళ్లి సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొంటాడు. యూఏఈ వేదికగా ఐపీఎల్ తాజా సీజన్ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. ఈ నెల మూడో వారంలో చెన్నై జట్టు యూఏఈ వెళ్లనుంది. కాగా, వ్యక్తిగత కారణాలతో రవీంద్ర జడేజా సూపర్ కింగ్స్ శిక్షణ శిబిరంలో పాల్గొనడంలేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.