కరోనా చికిత్సకు మరో ఔషధం.. క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
- ‘నిక్లోసమైడ్’ పేరుతో మ్యాన్‌కైండ్ ఫార్మా నుంచి ఔషధం
- ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ కోసం దక్షిణ కొరియాకు చెందిన దేవూంగ్‌తో ఒప్పందం
- ప్రాథమిక పరీక్షల్లో సత్ఫలితాలు
భారత్‌లో తొలిదశ ప్రయోగాలకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి దీనికి ఇప్పటికే అనుమతి లభించింది. మరోవైపు, ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ కోసం దక్షిణ కొరియాకు చెందిన దేవూంగ్ ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మ్యాన్‌కైండ్ ఫార్మా సీవోవో అర్జున్ జునేజ్ తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో ఈ ఔషధం మంచి ఫలితాలు ఇచ్చినట్టు అర్జున్ తెలిపారు.