కుమార్తెకు ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు తీర్పు సంతోషకరం: చంద్రబాబు
- ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సమాన హక్కు ఉంటుందని సుప్రీం తీర్పు
- హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
- ఆడబిడ్డలకు సమాన హక్కులు ఉండాలని 40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ ఆకాంక్షించారు
కుమారుడితో పాటు కుమార్తెకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం సంతోషకర విషయమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆడ బిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలని నాలుగు దశాబ్దాల క్రితమే ఎన్టీఆర్ గారు ఆకాంక్షించి, అమలు చేశారని చెప్పారు. రాజకీయాల్లో, చట్ట సభల్లో, ఉద్యోగాల్లో ఆడపడుచుల ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీనే అని తెలిపారు. స్వయం సహాయ బృందాలను ఏర్పాటు చేసి మహిళా శక్తిని చాటింది కూడా టీడీపీనే అని చెప్పారు.